తిరునిన్రవూరు శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీభక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి బుధవారం సాయంత్రం టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. శ్రీపెద్దజీయర్‌స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని టిటిడి శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.

ముందుగా తిరునిన్రవూరులోని శ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠానికి టిటిడి ఈవో చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఏడేళ్లుగా టిటిడి నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు. తిరు అనగా ‘శ్రీ లక్ష్మీ’ అని, నిన్ర అనగా ‘నిలబడి’ అని, వూరు అనగా ‘ప్రదేశం’ అని అర్థమని, శ్రీలక్ష్మీదేవి నిలబడి ఉన్న ప్రదేశంగా తిరునిన్రవూరు గుర్తింపు పొందిందని వివరించారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి అని చెప్పారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు టిటిడి కొంతమేర ఆర్థికసాయం అందించినట్టు ఈ సందర్భంగా ఈవో తెలిపారు.

అనంతరం తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామివారిని టిటిడి ఈవో దర్శించుకున్నారు.

ఇతర వివరాలకు news.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

12 Comments

 1. EvaWhaks
 2. EvaWhaks
 3. go auto insurance
 4. EvaWhaks
 5. KimWhaks
 6. Speedycash
 7. buy canadian cialis

  https://www.cialiswlmrt.com/# order cialis online

 8. EvaWhaks
 9. Quick Loan
 10. Cash Loan
 11. EvaWhaks

Leave a Comment

Your email address will not be published.

fifty two − = 42