తిరుమలలో బట్టబయలైన నకిలీ డోనార్ పాస్ పుస్తకాల దందా…

 

 

 • ఇంటి దొంగల సహకారంతో ఎద్దెచగా సాగిన నకిలీ దర్శన టికెట్ల వ్యాపారం…
 • 9 మంది దళారుల అరెస్ట్, పరారీలో టీటీడీ సూపెరిండెంట్
 • కోట్ల రూపాయలు వెనకేసుకున్న ఇంటా బయటా దొంగలు                  

తిరుమల, 22/03/17, ఓం ప్రకాష్: తిరుమలలో మరో నకిలీ దర్శన టికెట్ల దందా బయటపడింది. ఇంటి దొంగలు బయటి దొంగలు కుమ్మకై ఏకంగా 1000కి పైగా నకిలీ డోనార్ పాస్ పుస్తకాలను తయారుచేసి వాటితో ఎద్దెచగా బ్రేక్ దర్శనాల టిక్కెట్లను పొంది కోట్ల రూపాయలు వెనకేసుకున్న వ్యవహారం తాజాగా బయటపడింది. ఈ నెల 11 వ తేదీన బయటపడిన ఈ వ్యవహారంపై ఎట్టకేలకు పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం నాడు వివరాలను వెల్లడించారు. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా… కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన కరణం వేణుగోపాల్‌తో, తిరుపతికి చెందిన వెంకటేష్‌, రాజు, కె.వెంకటాచలపతి ఓ ముఠాగా ఏర్పడి టీటీడీ సుపెరిండెంట్’గా పనిచేస్తున్న ధర్మయ్య సహకారంతో గతంలో ఐఏఎస్‌ అధికారుల నకిలీ లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్లు పొంది అక్రమంగా ఇతరులకు విక్రయించేవారు. ఇలా పొందిన ఒక్కో బ్రేక్ టిక్కెట్టును రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు భక్తులకు అమ్ముకొని ధర్మయ్యతో కలసి ముఠా సభ్యులు నగదును పంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో 2015లో ఆగస్టు నుంచి టిక్కెట్లు పొందడం కష్టంగా మారడంతో ముఠా సభ్యులు ఓ సరికొత్త వ్యూహాన్ని రచించారు. నకిలీ దాతల పుస్తకాల తయారు చేసి వాటి ద్వారా ఎల్‌-1, ఎల్-2 బ్రేక్ టిక్కెట్లను పొంది వాటిని భక్తులకు విక్రయించాలని యోచించిన ముఠా అనుకున్నదే తడవుగా నకిలీ దర్శన దందాను మరలా మొదలుపెట్టారు. ఇందుకోసం ముఠా నాయకుడు కరణం వేణుగోపాల్‌ తనకు పరిచయం ఉన్న పుత్తూరుకు చెందిన పరంధామయ్య ద్వారా కోయంబత్తూరులో ఉండే దాతకు చెందిన ఒక ఒరిజినల్‌ పాసుపుస్తకాన్ని పొంది హైదరాబాదుకు చెందిన మురహరి అనే నకిలీ లేఖల తయారిదారుడికి మెయిల్‌ పంపి సుమారు 1000 కి పైగా నకిలీ దాతల పాసుపుస్తకాలను తయారు చేయించాడు. వేణుగోపాల్‌ తన వద్ద ఉన్న లాప్‌టాప్‌, కలర్‌ ప్రింటర్‌ సాయంతో అన్నప్రసాదం, గోసంరక్షణశాల విభాగాధిపతులతో పాటు తిరుమల జేఈవో సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పాస్ బుక్’లు తయారు చేశాడు. వీటిని ముఠా సభ్యులైన వెంకటేష్‌, తిరుపాల్‌ నాయక్‌, పరంధామయ్య, పార్థసారథి, గణేష్‌ల ద్వారా భక్తులకు ఇచ్చి నకిలీ దాతల పుస్తకాలను వినియోగంలోకి తెచ్చారు. వీటి ద్వారా పొందే తీసుకెట్లను ఒక్కోక్కటి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల కొన్ని సందర్భాల్లో నకిలీ పాసుపుస్తకాల వ్యవహారం బయటపడడంతో టీటీడీ వాటిని నిలువరించేందుకు ఈ జనవరి 1 నుంచి దాతలకు పాసుపుస్తకాలతో పని లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు పొందే సౌలభ్యం కల్పించింది. అయినప్పటికీ వేణుగోపాల్‌ తనకున్న పరిజ్ఞానంతో బార్‌కోడ్‌ స్కానింగ్‌ అయ్యే విధంగా దాతల ఆన్‌లైన్‌ టిక్కెట్లను కూడా జనవరి 22 నుంచి నకిలీ టిక్కెట్లు తయారు చేస్తూ తన దళారి దందాను కొనసాగిస్తూ వచ్చాడు, ఇలా ఈ నెల 11 వరకు వాటిని విక్రయించాడు. అయితే 11 వ తేదీన 23 మంది యాత్రికులు శ్రీవారి దర్శనానికి వెళ్తూ బార్‌కోడ్‌ స్కానింగ్‌ సమయంలో పట్టుబడడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసులో ప్రధాన నిందితుడైన వేణుగోపాల్‌’ను అతడి వద్దనున్న లాప్‌టాప్‌, రెండు ప్రింటర్లు, 80 నకిలీ పాసు పుస్తకాలు, 480 ఖాళీ పాసుపుస్తకాలను పట్టుకున్నారు. విచారణలో వేణుగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇతడికి సహకరించిన కొంతమంది దళారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వీరిలో తిరుపతికి చెందిన వెంకటరమణ, వెంకటాచలపతి, పార్థసారథి, నాగభూషణం, వి.జి.నాయుడు, జీవకోన వాసి గణేష్‌, కరకంబాడికి చెందిన శ్రీనివాసులు, ముత్యాలరెడ్డిపల్లెకు చెందిన రాజును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో నిందితులతో పాటు మరికొంత మంది టీటీడీ ఉద్యోగుల పాత్ర ఉండడంతో పోలీసులు ఆ విషయాన్ని గోప్యంగా విచారిస్తున్నారు…

 • దళారుల వద్ద స్వాధీనం చేసుకున్న నకిలీ పాసు పుస్తకాలను, లాప్ టాప్, ప్రింటర్లను మీడియాకు చూపెడుతున్న సిఐ వెంకట్ రవి

3 Comments

 1. Jertprecy
 2. authentic viagra online

  Viagra Ricetta Medica Svizzera

 3. priligy tablet

  Nebenwirkungen Viagra Und Diabetes

Leave a Comment

Your email address will not be published.

80 − seventy two =