శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రెండు కోట్లు విరాళం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నిత్యాన్నదాన పథకానికి గురువారం నాడు ఓ అజ్ఞాత భక్తుడు రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందించాడు. ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న దాత ఆలయంలో తిరుమల జెఈఓ శ్రీనివాసరాజును కలసి విరాళాన్ని డి.డి రూపంలో ఆయనకు అందజేశారు. విరాళాన్ని అందుకున్న జెఈవో ఆలయ మర్యాదల ప్రకారం దాతకు రంగనాయకుల మండపంలో ఆలయ పండితులచే వేదాశీర్వానం అందజేయించి, స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేసారు. ఈ సందర్బంగా ఆలయం వెలుపల జెఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ నిత్యం లక్షలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదా వితరణ చేస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి అన్నప్రసాదం ట్రస్టుకు విశేష ఆదరణ లభిస్తోంది హర్షం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు దాతల అందజేసిన విరాళాలతో ట్రస్టు మూల నిధి సుమారు వెయ్యి కోట్లకు చేరువవుతొందని తెలిపారు. శ్రీవారి పేరిట సామన్యభక్తుల సేవ కోసం విరివిగా విరాళాలను అందజేస్తున్న దాతలందరికి ఆ శ్రీనివాసుడు సుఖసంతోషాలను, అయూరారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Comment

Your email address will not be published.

− four = 2