ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమలలో అన్నప్రసాద వితరణకు వెంగమాంబ శ్రీకారం : టిటిడి ఈవో
వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శ్రీశ్రీశ్రీ అనుపమానంద స్వామి
శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయడమే గాక, తిరుమలలో అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టారని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. మాత శ్రీ తరిగొండ వెంగమాంబ 287వ జయంతి ఉత్సవాలు మంగళవారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ 18వ శతాబ్దంలో సమాజంలో భక్తిభావాన్ని వ్యాప్తి చేసిన ఆదర్శమూర్తిగా వెంగమాంబ నిలిచారని కొనియాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీనృసింహస్వామివారి వైభవంపై మొత్తం 18 గ్రంథాలను రచించారని తెలిపారు. వెంగమాంబ జయంతి ఉత్సవాలను తిరుమల, తిరుపతి, తరిగొండలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించామని వివరించారు. తిరుమలలోని వెంగమాంబ ఉద్యానవనంలో పుష్పాంజలి సమర్పించినట్టు తెలిపారు.
అంతకుముందు తిరుపతికి చెందిన శ్రీరామకష్ణమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అనుపమానంద స్వామివారు అనుగ్రహభాషణం చేశారు. వెంగమాంబ తన సాహిత్యం, సంకీర్తనల ద్వారా అప్పట్లో సమాజంలో ఉన్న సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి సంస్కరించారని తెలిపారు. వెంగమాంబ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తుల్లోని అంశాలను తెలుసుకోవచ్చన్నారు.
ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6.00 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ గుంటి నాగేశ్వరనాయుడు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఇందులో ” గణనాయక శరణు…., బాలగోపాలం భజే హే మనసా…., వచ్చెను కృష్ణడు వగమీరగ…., లాలి మద్దుల బాల లాలి గోపాల…., జయమంగళం నిత్య శుభ మంగళం….” తదితర సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఘనంగా పుష్పాంజలి :
తిరుమలలోని వెంగమాంబ బందావనంలో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు టిటిడి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీమతి శారద, వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఏఈవో శ్రీమతి పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా నృసింహ జయంతి :
నృసింహ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ యోగ నరసింహస్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేశారు. స్వామివారి మూలమూర్తికి అర్చకులు స్నపనం చేపట్టారు.

11 Comments

 1. cialis buy online

  Direct Progesterone Pills No Doctor Amex Accepted

 2. inquida
 3. plaquenil for fibromyalgia

  Flow Max Where To Buy

 4. Feancehon
 5. DIASUSE
 6. WimWhaks
 7. TedWhaks
 8. CarlWhaks
 9. TeoWhaks
 10. UgoWhaks
 11. TeoWhaks

Leave a Comment

Your email address will not be published.

thirty − = twenty three