టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు గురువారం ఈ-హుండీ ద్వారా శ్రీవారికి ఒక లక్ష రూపాయలు కానుకగా సమర్పించారు. ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ-హుండీ, ఈ-డొనేషన్ తదితర ఆన్‌లైన్ అప్లికేషన్లకు ఈవో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.