ADDITIONAL FIRE EXTINGUISHERS AS PER FIRE SAFETY NORMS-TTD EO

TTD EO

తిరుమలలో అదనంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలి

వణ్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు శుద్ధిచేసిన నీటిని అందించాలి :

టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు

తిరుమలలో అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో మంగళవారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠం కాంప్లెక్స్‌లోని అక్షయ వంటశాలలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. వేసవిలో వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైపులైన్‌ ద్వారా శుద్ధి చేసిన నీటిని అందుబాటులో ఉంచాలని ఇంజినీరింగ్‌, ఫారెస్టు అధికారులను ఆదేశించారు.

మరో మూడు నెలల్లో సర్వదర్శనం కాంపెక్స్‌ పనులను పూర్తి చేసి, ప్రత్యేక ప్రవేశదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్‌ల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈవో ఆదేశించారు. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో భక్తులకు లడ్డూ టోకెన్లు, లగేజి, మొబైల్‌ డిపాజిట్‌ కౌంటర్లు, పాలు, టీ, కాఫీ, తాగునీరు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలలోని అన్ని అతిథి భవనాలలో ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయాలని, శ్రీగంధం ఉద్యానవనం పరిసరాలలో పెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

విద్యావంతులు, కంప్యూటర్‌ పరిజ్ఞానం గల శ్రీవారి లడ్డూ ప్రసాద సేవకులతో 20 లడ్డూ ప్రసాద కౌంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి              డా|| టి.రవిని అదేశించారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవ భక్తుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను రూపొందించాలని టిటిడి ఐటి అధికారులను ఈవో ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సి.ఇ. శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎఫ్‌.ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

17 Comments

  1. WimWhaks
  2. provigilvsmodafinil

    modafinil prescription online provigil for depression

  3. WimWhaks
  4. provigildrug

    modalert provigil 100mg

  5. MarkWhaks
  6. modalert

    modafinil otc modafinil generic

  7. LisaWhaks
  8. BooWhaks
  9. JudyWhaks
  10. AmyWhaks
  11. YonWhaks
  12. AshWhaks
  13. MaryWhaks
  14. PrpiPr

    stromectol scabies stromectol amazon

  15. TedWhaks
  16. JackWhaks
  17. ivermectin

    health medicine http://ivermectiny.com – stromectol

Leave a Comment

Your email address will not be published.

− two = 1