ప్రముఖ బాలీవుడ్ నటుడు, రక్తచరిత్ర ఫేమ్ వివేక్ ఒబ్’రాయ్ ఈ రోజు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నాడు. కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన ఆయనకు అధికారులు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలువులకు వచ్చిన ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సంబరపడ్డారు…