కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న టిటిడి ఈవో

TTD EO tonsure

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తన సతీమణి శ్రీమతి జ్యోతిష్మతితో కలిసి బుధవారం కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. 2014, డిసెంబరు 17న టిటిడి 24వ ఈవోగా డా|| డి.సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే.

Leave a Comment

Your email address will not be published.

forty three − = thirty nine