యాగఫలంతో త్వరలో సువృష్టి కురవాలి : టిటిడి ఈవో

తిరుమలలో నిర్వహించిన కారీరిష్టి యాగం, వరుణజపంతో త్వరలో సువృష్టి కురిసి దేశప్రజలు సుభిక్షంగా ఉండాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆకాంక్షించారు. తిరుమలలోని పార్వేట మండపం వద్ద మే 29న ప్రారంభమైన కారీరిష్టి యాగం శుక్రవారం శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద మహాపూర్ణాహుతితో ముగిసింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి స్వామివారి శుభాశీస్సులతో వారి పర్యవేక్షణలో ఈ యాగం జరిగింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ యాగం నిర్వహించామని, త్వరలో మంచి వర్షాలు కురుస్తాయని విశ్వసిస్తున్నామని తెలిపారు. తద్వారా దేశంలో, రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తొలగి రైతులు, ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో         ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి విచ్చేసిన 30 మంది రుత్వికులు అకుంఠిత దీక్షతో యాగం చేపట్టినట్లు తెలిపారు.

తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు మాట్లాడుతూ మంచి ఫలితాల కోసం కారీరిష్టి యాగం, వరుణజపంతో పాటు అమృతవర్షిణి రాగాలాపన, విరాటపర్వ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ యాగంలో పురోహితుడు శ్రీ లక్ష్మీవెంకటరమణ దీక్షితర్‌ ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, పరకామణి డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఇతర అధికారులు