Bhasyakarula Utsavam begins in Tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం భాష్యకారుల ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భగవద్‌ రామానుజుల వారి ఉత్సవమూర్తికి స్వర్ణకవచం అలంకరించి తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం ఈ స్వర్ణ కవచాన్ని రామానుజుల వారికి కానుకగా సమర్పించాడు.

తిరుచ్చిపై ఊరేగింపు సందర్భంగా జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

కాగా, భగవద్‌ రామానుజాచార్యులను భాష్యకారులు అని వ్యవహరిస్తారు. బ్రహ్మసూత్రాలకు ‘శ్రీభాష్యం’ రచించిన కారణంగా రామానుజాచార్యులకు భాష్యకారులనే నామం ఏర్పడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు భాష్యకారుల ఉత్సవం జరుగనుంది. మే 1వ తేదీన సాలకట్ల భాష్యకార్లవారి సాత్తుమొర నిర్వహిస్తారు.

7 Comments

  1. BooWhaks
  2. JimWhaks
  3. ivermectin tablets for humans uk

    ivermectin dosage http://stromectolforte.com/# ivermectin side effects ivermectin for humans where to buy

  4. JaneWhaks
  5. LisaWhaks
  6. JoeWhaks

Leave a Comment

Your email address will not be published.

85 − = eighty three