తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో బుధవారంనాడు రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవను నిర్వహిస్తున్నది విదితమే.
కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జె.ఇ.ఓ/ తిరుమల ఇంచార్జ్‌ జె.ఇ.ఓ శ్రీ పోలా భాస్కర్‌, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, వి.జి.ఓ  శ్రీ రవీంద్రారెడ్డి, వి.ఎస్‌.ఓలు శ్రీమతి విమలకుమారి, సదాలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

3 Comments

  1. viagra without subscription

    Amazing plenty of helpful advice. viagra online usa

  2. cbdistillery

    With thanks. I appreciate it! cbd oil

  3. generic viagra names

    Cheers. I value it. viagra online

Leave a Comment

Your email address will not be published.

+ 20 = twenty seven